Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ముందస్తు ఎన్నికలొద్దు

ప్రతిపాదనకు పెరూ కాంగ్రెస్‌ తిరస్కృతి


లిమా: లాటిన్‌ అమెరికా దేశంలో నిరసనలు మిన్నంటినాగానీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలన్న ప్రతిపాదనను పెరూ కాంగ్రెస్‌ తిరస్కరించింది. ఈ ఏడాది డిసెంబరులో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా 54 మంది ఓటు రాగా, 68 మంది తిరస్కరించారని, ఇద్దరు గైర్హాజరయ్యారని పార్లమెంటు వర్గాలు వెల్లడిరచాయి.. డిసెంబర్‌లో ముందస్తుగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై రాజ్యాంగ సంస్కరణల సంబంధిత బిల్లులు 1897, 1918 ప్రతిపాదన ఆమోదం పొందలేదని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. 2022 డిసెంబరు 7న అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోపై వేటు పడిరది. అప్పటి ప్రధాని దీనా బొలుర్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పెరూలో నిరసనలు హోరెత్తాయి. బొలుర్టే రాజీనామా చేయాలంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్‌ను రద్దు, మాజీ అధ్యక్షుడు పెడ్రో విడుదల కోసం భారీ ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో హింస చెలరేగి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img