Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

నాగచైతన్య చిత్రంలో సీఎంగా ప్రియమణి

హైదరాబాద్‌: నాగ చైతన్య మొదటిసారిగా ఒక తెలుగు, తమిళ్‌ సినిమా చేస్తున్నాడు అదే ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దీనికి దర్శకుడు. ఈ సినిమా చాలా శాతం షూటింగ్‌ అయిపోయింది కానీ ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయకురాలు కాగా, ప్రియమణి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళ నటుడు అరవింద స్వామి కూడా ఇందులో ఒక ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. ఇంతకీ ప్రియమణి చేస్తున్న పాత్ర చాలా బలమైనదని అన్నారు కానీ, ఏంటి అన్నది బయటకి రాలేదు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనపడనుందని తెలిసింది. ఈ ముఖ్యమంత్రి పాత్ర సినిమాకు చాల కీలకం అని కూడా సమాచారం. ఈ పాత్రకు ముందు ఎందరినో అనుకున్న చివరికి ప్రియమణి అయితేనే కరెక్టు అని ఆమెకి ఈ కథ చెప్పారని తెలిసింది. మొదట్లో ప్రియమణి చిన్న పాత్ర అని చెయ్యొద్దు అనుకున్నా, నిర్మాత చిట్టూరి శ్రీనివాస్‌, దర్శకుడు వెంకట్‌ ప్రభు ఆమెని ఒప్పించారని తెలిసింది. శేనివారం ఆమె సెట్‌ లోకి అడుగు పెడుతోంది అని కూడా అంటున్నారు. ఆమె షూటింగ్‌ ఒక వారం పాటు ఉంటుందని తెలిసింది. కస్టడీలో నాగ చైతన్య ఒక ఇంటెన్స్‌ రోల్‌ ప్లే చేస్తున్నట్టుగా తెలిసింది. ఈమధ్యనే నాగ చైతన్య, కృతి శెట్టిల మీద అన్నపూర్ణ స్టూడియో లో ఒక పాట కూడా చిత్రీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img