Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్ర సచివాలయ మహిళా పోలీస్ అసోసియేషన్ కోశాధికారిగా వరలక్ష్మి

విశాలాంధ్ర- మైలవరం: రాష్ట్ర సచివాలయ మహిళా పోలీస్ కోశాధికారిగా మైలవరం నంబర్-5 సచివాలయం మహిళా పోలీస్’గా విధులు నిర్వహిస్తున్న వేముల వరలక్ష్మి ఎంపికయ్యారు. విజయవాడలో బుధవారం నాడు జరిగిన రాష్ట్ర సచివాలయం మహిళా పోలీసుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో అడహక్ కమిటీ అధ్యక్షురాలుగా మహాలక్ష్మి ప్రధాన కార్యదర్శిగా మధులత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నందిని’లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎంపికైన వరలక్ష్మి’ని పోలీస్ అధికారులు,సహచర మహిళా పోలీసులు,సచివాలయ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి మంచి ఆశయంతో సచివాలయంలో మహిళ పోలీసుగా ఉద్యోగం సాధించి చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నానని అన్నారు. అసోసియేషన్ కోశాధికారిగా తనను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే అసోసియేషన్ మరోపేతానికి సహచర ఉద్యోగస్తుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని వరలక్ష్మి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img