Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పారదర్శకంగా భూ రీ సర్వే

అడవి కిషోర్…

విశాలాంధ్ర – ఉండి: సమస్యల పరిష్కారం కోసమే డ్రోన్ ఫ్లై నిర్వహిస్తున్నట్లు భూ రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ అడవి కిషోర్ తెలిపారు. సోమవారం ఉండి మండలం అర్తమూరు గ్రామంలో గ్రామ రెవిన్యూ అధికారి పిన్నమరాజు శివరామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన భూ రీ సర్వే కార్యక్రమంలో అడవి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాలను భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అత్యాధునికమైన డ్రోన్ ద్వారా రీసర్వే చేయడం వలన పారదర్శకంగా ఎటువంటి తప్పులు లేకుండా సరిహద్దులను గుర్తించడం జరుగుతుందని గ్రామంలో
రీసర్వే చేయడానికి సిబ్బంది వచ్చినప్పుడు రైతులు తమ పాస్ పుస్తకాలను, డాక్యుమెంట్లను వారికి చూపించాలని కోరారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన డ్రోన్ ఫ్లైను గ్రామ సర్పంచ్ గోనబోయిన వీర్రాజు, ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వర రావు, గ్రామ పెద్దలు గోనబోయిన రామదాసు, గోనబోయిన వెంకటేశ్వరరావు, కందుల బుజ్జి, రామేశ్వరరావు, చెరుకువాడ గ్రామ రెవెన్యూ అధికారి సైదాడ చిన్నారావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img