Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్కామ్‌లు చేసేది మోదీ.. విపక్షాలపై కేసులు పెట్టేది ఈడీ.. కేటీఆర్‌

స్కామ్‌లు మోదీ చేస్తే.. ఈడీ మాత్రం విపక్షాలపై ఈడీ కేసులు పెడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మోదీ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు. కవితకు ఇచ్చినవి ఈడీ నోటీసులు కాదని.. మోడీ నోటీసులని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఓవైపు ప్రతిపక్షాలపై కేసుల దాడి.. మరోవైపు ప్రజలపై ధరల దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 8 ఏళ్లగా జుమ్లా.. లేకపోతే హమ్లా నడుస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారన్నారు.బీఆర్‌ఎస్‌ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారన్నారు. తమ నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారు. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు అన్నారు. ప్రతి పక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి.. గౌతం అదానీ ఎవరి బినామీ..? అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడన్నారు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్లు డ్రగ్స్‌ దొరికినా అదానీపై చర్యలు ఎందుకు లేవు ? అని మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ నిజస్వరూపం బయడపెడతామన్నారు. బీజేపీ మౌత్‌ పీస్‌ గా ఉన్న మీడియా సంస్థలను ప్రజాక్షేత్రంలో నిలబెడతామన్నారు. మాఫియా నడిపినట్లు మీడియాను నడిపిస్తున్నారన్నారు. బీజేపీ వాళ్లు మాత్రమే సత్య హరిశ్చంద్రులా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img