Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

రెండు క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా

సియోల్‌: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాశాలు మొదలు పెట్టిన క్రమంలో మంగళవారం రెండు బాలిస్టిక్‌ మిసైళ్లను ఉత్తర కొరియా ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాశాలను తమ దేశంపై యుద్ధానికి సన్నాహాలుగా ఉత్తర కొరియా భావిస్తున్న విషయం తెలిసిందే. జాంగ్‌యోన్‌ కోస్తా పట్టణం నుంచి దగ్గర లక్ష్యాలు ఛేదించే రెండు క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా సంయుక్త చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్రకటన తెలిపింది. 620 కిమీల దూరాన్ని క్షిపణులు ప్రయాణించాయని, తద్వార వీటి లక్ష్యం దక్షిణ కొరియా అని తెలుస్తోందని పేర్కొంది. 28వేల అమెరికా సైనిక దళాలు దక్షిణ కొరియాతో సైనిక విన్యాశాల్లో పాల్గొంటున్నాయి. తాజా ప్రయోగాలతో తమ మిత్రపక్షాలకు ముప్పులేదని అమెరికా ఇండోపసిఫిక్‌ కమాండ్‌ వెల్లడిరచింది. ఉత్తర కొరియాలో అక్రమంగా ఆయుధాల తయారీ అనిశ్చితిని సృష్టించే ప్రయత్నాల్లో భాగమేనని పేర్కొంది. దక్షిణ కొరియా, జపాన్‌కు అమెరికా రక్షణపై రాజీ లేదని, ఇది క్కుపిడికితో సమానమని అమెరికా ఇండోపసిఫిక్‌ కమాండ్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img