Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చలివేంద్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ – కలెక్టరును సన్మానించిన రైతులు

విశాలాంధ్ర, పాలకొండ/పార్వతీపురం : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వీరఘట్టం మండలంలోని చలివేంద్రి గ్రామాన్ని గురువారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. రైతుభరోసా కేంద్రం వద్ద రైతులతో ముఖాముఖిగా పలు అంశాలపై మాట్లాడారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కాలువ మరమ్మతు అవసరం ఉందని రైతులు తెలిపారు. కాలువ మరమ్మతు చేయడం వల్ల సాగునీరు అందుతుందని, రబీపంటలు వేయుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.దీనికి సంబందించి జలవనరులశాఖ అధికారులతో చర్చిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామంలో ధాన్యంకొనుగోలుపై ఆరా తీయగా 16,500 టన్నుల ధాన్యం గ్రామం నుంచి కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ వివరించారు. ధాన్యంకొనుగోలుకు సంబందించి డబ్బులు అందరి ఖాతాల్లో జమయ్యాయని రైతులు వివరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఇతర సామగ్రి పంపిణీకి దృష్టి సారించాలని జాయింట్ డైరెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో కస్టమ్ హైర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి చెప్పారు.
మంచిమనస్సుతో గ్రామానికి వచ్చారని, మీరాకతో వర్షం కురిసి వాతావరణం చల్లబడిందని రైతులు జిల్లా కలెక్టరుకు తెలిపారు. జిల్లా కలెక్టర్ రైతులతో మమేకమయ్యారు. ఈసందర్భంగా రైతులు జిల్లా కలెక్టరును దుశ్శాలువతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img