Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చిన్నారాయుడుపేటలో రామాలయ ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం


విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని చిన్నారాయుడుపేట గ్రామంలో శ్రీరామాలయ ప్రతిష్ఠఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈగ్రామంలో రామాలయం లేకపోవడాన్ని గుర్తించిన సమరసత సేవా ఫౌండేషన్ గ్రామంలో గలగిరిజనులతో టీటీడీకు విజ్ఞప్తి చేసింది. దీంతో సమరసత సేవా ఫౌండేషన్
సౌజన్యంతో, తిరుమల తిరుపతి దేవస్థానం 10లక్షల రూపాయల మంజూరు చేసింది.టీటీడీ ఆర్ధిక సహకారంతో , మన్యంజిల్లాలో మొదటివిడతగా ఈగ్రామంలో ఆలయం నిర్మాణం మూడున్నర నెలల్లో గ్రామ కమిటీ సభ్యులు పూర్తి చేశారు.నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీసీతారామాలయం ప్రతిష్టా కార్యక్రమం శుక్ర, శనివారాల్లో ఘనంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పురోహితులు మైలారభట్ల ప్రసాద్ రావు శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వాసిరెడ్డి యేగేశ్వరరావుగారు, జోనల్ ధర్మప్రచారకులు అడాలి గంగాధర్ , సబ్ డివిజన్ ధర్మప్రచారకులు దేవళ్ళ సురేష్, మాజీ ఎంపీపీ బొంగు వరలక్ష్మి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టి రాజు, సర్పంచ్ అప్పలనరసమ్మ సాంబన్న దొర, సూరమ్మపేట, మరిపివలస, చిన్నా రాయుడుపేట పెద్దలు,భక్తులు , ప్రజలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img