Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడండి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : గ్రామ రెవిన్యూ పరధిలోనే సర్వే నెంబర్ 265/ఏ3 నందు గల 3, 30 సెంట్లు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురౌతున్నా మండల రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కర్నూలు జిల్లా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ విభాగం జిల్లా రిప్రజేంటివ్ బొగ్గుల తిక్కన్న సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసు నందు జరిగిన స్పందనలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకడబూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 262 నందు 8.47 ఎకరములు స్మశాన భూమికలదని, అందులో 5.19 సెంట్లలలో పోలీస్ స్టేషన్ అండ్ క్వార్టర్స్, స్మశానం కలదని గుర్తు చేశారు. అందులో మిగిలిన సర్వేనెంబర్ సబ్ డివిజన్ 262/ఏ3 నందు 3. 38 సెంట్లు ఓపెన్ సైట్ భూమి కలదని, సదరు భూమి రెండు మెయిన్ రోడ్లుకు యస్.సి కాలనీకి అందుబాటులో కలదన్నారు. సదరు భూమి సెంటు లక్ష రూపాయలకు పైగా విలువ చేస్తుందని, భూమి మొత్తం 3 కోట్ల రూపాయలపైగా విలువ చేస్తుందని కలెక్టర్ కు తెలిపారు.
సదరు భూమిలో 2016 లో కాలనీవాసులు కొందరు మత దేవాలయాలు కట్టుటకు ప్రయత్నిస్తే హైకోర్టును ఆశ్రయించి స్టే తేవడం జరిగిందన్నారు. అంతటితో వారి ప్రయత్నాలు అగిపోయినాయని, అప్పటినుండి ఈ స్థలం ఖాళీగానే ఉంటూ పెంటదిబ్బలతో నిండియుండి ఉందని, ఈ ఓపెన్ సైట్ స్థలం మెయిన్ రోడ్స్ కు మధ్యలోను యస్.సి.కాలనీకి అందుబాటులో ఉండి పైగా విలువైనందున పెంటదిబ్బలు వేసిన వారు స్థల కబ్జాకు తెరలేపారన్నారు. అయితే ఓ నాయకుడు తహశీల్దార్ తో పట్టాలు ఇప్పిస్తానని చెపుతూ భూ కబ్జాకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒకే కుటుంబంలో రెండు, మూడు నకిలీ పట్టాలు తయారు చేసి లక్షల రూపాయలు దండుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా కబ్జాదారుల చేతికి అందిస్తున్నారని సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు . నకిలీ పట్టాల తయారీకి కార్యలయం లో పని చేసే ఒక చిరుద్యోగి సహకారం ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన సబ్ కలెక్టర్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని, ప్రభుత్వ భూమిలో ఇచ్చిన నకిలీ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img