Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం దారుణం

ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రకటించడం దారుణమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద కరపత్రాలను విడుదల చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి వారు మాట్లాడుతూ భారత దేశాన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తి కలిగించి దేశ ప్రజానీకం కోసం దేశ అభివృద్ధి కోసం ప్రాణాలను అర్పించి 75 సంవత్సరాల స్వాతంత్య భారతావనిని ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందన్నారు. అయితే దేశ ప్రధాని మోడీ ఒకవైపు దేశ సంపదని కొల్లగొడుతున్నారని మరోవైపు హిందుత్వం పేరుతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని వారు మండిపడ్డారు. అంతేకాకుండా అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలను బిజెపి ప్రభుత్వం చేస్తుందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు తీసుకెళ్తుందని, నిరుద్యోగుల ఆత్మహత్యల వైపును కూడా ప్రేరేపిస్తూ, అమాయక ప్రజానీకాన్ని మోసంగా చిత్రిస్తూ వారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని ఇదేమని అడిగితే… సభ్యత్వాన్ని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యం అహింసలను ఆయుధంగా మరుచుకొని మరో స్వాతంత్ర పోరాటాన్ని నిర్మిస్తున్న రాహుల్ గాంధీకి యావద్దేశం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటికైనా మోడీ నియంతృత్వ పోకడలను మాని, రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర, నాయకులు చైతన్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img