Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానంకు..గడువు పెంపు

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31ని దీనికి డెడ్‌లైన్‌గా ప్రకటించగా.. తాజాగా మరోసారి గడువు పొడగించింది. దీంతో ఈ రెండు కార్డుల్ని లింక్ చేసుకోని వారికి పెద్ద ఊరట కలిగింది. తాజాగా ఈ గడువును జూన్ 30కి పొడగిస్తూ నిర్ణయిం తీసుకుంది సీబీడీటీ. ఈ మేరకు తాజాగా మార్చి 28న ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయాన్ని అందించేందుకు.. పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునేందుకు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు సీబీడీటీ వివరించింది. ఆ తేదీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆధార్, పాన్ లింక్ డెడ్‌లైన్‌ను పొడగించడం సీబీడీటీకి ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఇక ఆధార్, పాన్ లింక్ చేసుకోకుంటే.. పాన్ కార్డు పనిచేయదనే విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తూనే వస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img