Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఒత్తిడిని జయిస్తే పదిలో ఉత్తమ ఫలితాలు…

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : విద్యార్ధులు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకుని ఒత్తిడిని జయిస్తే పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని గ్రామ ఉప సర్పంచ్ సరిపల్లి పెద వెంకట రాజు అన్నారు. శుక్రవారం మారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి విద్యార్ధులకు మనోజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరీక్షా సామగ్రిని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వెంకటరాజు మాట్లాడుతూ పదవతరగతిలో విజయం సాధిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన సాధించవచ్చన్నారు. మొదటి సారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడిని పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు వ్రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని ఫలితాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు, కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి ఉన్నతమైన పేరు తీసుకొచ్చే విధంగా పదవతరగతి పరీక్షలు వ్రాయడానికి సిద్ధం కావాలన్నారు. మనోజ్ఞ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ విజయ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి స్థాయి నుంచే ఎంచుకున్న రంగంలో విజయం సాధించేవరకు కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. పదవతరగతి ఫలితాలు ఉ న్నత విద్య, విధానానికి మార్గం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.కనకదుర్గ, కళ్ళేపల్లి లక్ష్మీపతిరాజు, సయ్యద్ పాతిమ, సచివాలయ కార్యదర్శి మహమ్మద్ అహ్మద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img