Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మతోన్మాద బిజెపిని సాగునంపదాం

సీపీఐ పిలుపు

విశాలాంద్ర , కళ్యాణదుర్గం : ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపడమే ధ్యేయంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార బేరి నిర్వహిస్తామని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ శనివారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నివసిస్తూ ఈనెల 30 వరకు జరిగే ప్రచార బేరి గోడ పత్రికలను ముదిగల్లు రోడ్డు లోని సిపిఐ ఆఫీసులో విడుదల చేశారు. రైతు సంఘం తాలూకా కార్యదర్శి నరసింహులు, కళ్యాణ దుర్గం, బ్రహ్మసముద్రం , సెట్టూరు మండల కార్యదర్శి లు ఆంజనేయులు, నాగరాజు నాయక్ , జయరాం , పట్టణ కార్యదర్శి ఓంకార్, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి హనుమంతు తో కలిసి గోడ పత్రికలు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజలు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరచింది అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగం పరిరక్షణ దేయంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార బేరి నిర్వహిస్తామన్నారు. ఆదానీపై హీడెనబర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరుణ ఆపాలని, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ నిర్మించాలని, గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విభజన హామీలను అమలు చేసి ప్రత్యేక హోదా వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మహమ్మద్ సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img