Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆల్ ఇండియా బంజారా సేవ సమితి నిరసన

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా బంజారా సేవా సమితి కమిటీ పిలుపుమేరకు శుక్రవారం వీరంతా శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాలని పెనుకొండ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలియజేసి నినాదాలు చేశారు వారు రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల బిసి కులాలను ఎస్టీ జాబితాలో కలపు రాదని నిరసన చేపట్టడానికి పెద్ద ఎత్తున బంజారా లు తరలి వెళ్లారు ఈ కార్యక్రమం పెనుకొండ కమిటీ అధ్యక్షులు శ్యాంసుందర్ నాయక్, జనరల్ సెక్రెటరీ గంగాధర్ నాయక్, జాయింట్ సెక్రెటరీ సాయిరాం నాయక్ ,గౌరవ అధ్యక్షులు పోలీస్ నారాయణ నాయక్ ఉపాధ్యక్షులు జండా నాయక్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్ నాయక్, ట్రెజరీ రామచంద్రనాయక్, కలసి జిల్లాలో ధర్నాలో లంబాడీల ఆడ మగ పిల్లల్లో అందరూ కలిసి ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వము చేసిన బోయ వాల్మీకి బెంతు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అంశాన్ని అసెంబ్లీలో తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఈ డిమాండ్ల సాధనకు ధర్నాలో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img