Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో 8 కేంద్రాలలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని, పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్ వార్డు సచివాలయం, రాజేంద్రనగర్ సచివాలయం,పార్థసారధి నగర్-2 సచివాలయం,ఎస్బిఐ కాలనీ వార్డు సచివాలయం, రాంనగర్ వార్డు సచివాలయం,దుర్గా నగర్-2 వార్డు సచివాలయం, ఎల్సికాపురం వార్డు సచివాలయం, బోయ వీధి సచివాలయం లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలలో ఆధార్ నమోదు/శిశు ఆధార్ నమోదు చేయబడునన్నారు. ఆధార్ నవీకరణ అనగా పేరు మార్పు, పుట్టిన తేదీ మార్పు ,చిరునామా మార్పు, మొబైల్ నెంబర్ నమోదు/ మార్పు, ఈమెయిల్ ఐడి నమోదు/ మార్పు, సంబంధికుల పేరు మార్పు, కొత్త జిల్లా పేరు మార్పు, బయోమెట్రిక్ నవీకరణ, ఫోటో మార్పు, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్, ఆధార్ డౌన్లోడ్ తో పాటు లామినేషన్ లాంటివి సేవలు అందించబడునని తెలిపారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఆధార్ కార్డు చేర్పులు, మార్పులపై చక్కటి అవకాశం ఉన్నందున తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img