Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అంతర్జాతీయ స్థాయికి హాకీ క్రీడలు ఎదిగేలా కృషి చేయాలి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : అంతర్జాతీయ స్థాయికి హాకీ క్రీడలు ఎదిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన శ్రీ సత్యసాయి జిల్లా హాకీ టోర్నమెంట్ కు శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొరత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, మున్సిపల్ వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి పెనుజూరు నాగరాజు ( సాయిరాం) లు క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాభివందనాలు తెలిపారు. అనంతరం కొద్దిసేపు హాకీ క్రీడలను తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో అన్ని క్రీడలకు నేడు ఈ క్రీడా మైదానం ఒక వేదికగా మారడం క్రీడాకారులకు ఒక మంచి అవకాశం అని తెలిపారు. తాను కూడా చదువుకున్న రోజుల్లో చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని చూపే వాడినని వారు తెలిపారు. ఈ హాకీ పోటీలు పూర్తి అయిన తర్వాత విజేతలలో విన్నర్స్ కు 50 వేల రూపాయలు, రన్నర్స్ కు 25వేల రూపాయలు, మూడవ బహుమతిగా పదివేల రూపాయలు తన సొంత ఖర్చుతో విజేత క్రీడాకారులకు పంపిణీ చేస్తానని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఏపీ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్య సాయి జిల్లా హాకీ జనరల్ సెక్రెటరీ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ హాకీ క్రీడలు లేట్ బిఎస్ రాయుడు మెమోరియల్ 13వ హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్టిక్ సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్-2023 నిర్వహించడం జరుగుతుందన్నారు. 15 జిల్లాల నుంచి హాకీ జెట్లు పాల్గొంటున్నానని తెలిపారు. హాకీ పోటీల్లో పాల్గొనే వారందరికీ కూడా సాయి నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో ఉచిత వసతి ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈనెల 21వ తేదీన ప్రారంభమై 24వ తేదీన ముగుస్తుందని తెలిపారు. ఈ హాకీ పోటీలకు సత్యసాయి జిల్లా, అనంతపురం, కడప, కర్నూల్ ,తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల నుండి హాకీ జేట్లు పాల్గొంటున్నారని వారు తెలిపారు. శుక్రవారం రోజున అనంతపూర్ వర్సెస్ ప్రకాష్ జట్టులో అనంతపురం విజేత, ఎన్టీఆర్ వర్సెస్ వైయస్సార్ పోటీలో డ్రా అయింది, విజయనగరం వర్సెస్ తిరుపతి జట్టులో.. తిరుపతి విజేత, శ్రీకాకుళం వర్సెస్ నెల్లూరు తడపడగా నెల్లూరు విజేత, శ్రీ సత్య సాయి కర్నూల్ జట్టులు తలపడక సత్యసాయి జిల్లా విజేతలు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ హాకీ అధ్యక్షులు చాణక్యరాజు, జనరల్ సెక్రెటరీ హర్షవర్ధన్, ఉమ్మడి జిల్లాల డిఎస్డివో జగన్నాథరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఓబిరెడ్డి, ఊక అశ్వత్ నారాయణ, ఉడుముల రామచంద్ర, కట్టం వీరనారాయణ, శ్రీ సత్య సాయి జిల్లా పిఈటి అసోసియేషన్ అధ్యక్షులు ఓబులేసు, అనిల్ కుమార్, రఘునాథ రావు, అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, అమురుద్దీన్, కిరణ్, ఆమీ నూరుల్లా, ఊక రాఘవ, నారాయణస్వామి, మారుతి కుమార్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img