Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డీలర్ భార్య మృతికి సంతాపం-ఆర్థిక సహాయం అందజేత

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని స్టోర్ డీలర్ ఉక్కిసుల మురళి భార్య ఇటీవల మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం స్టేట్ స్టోర్ డీలర్ల అధ్యక్షులు పరందామరెడ్డి ఆ కుటుంబానికి వెళ్లి, పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి పదివేల రూపాయలను ధర్మవరం డీలర్స్ అసోసియేషన్ తరపున అందజేశారు. పరంధామ రెడ్డి మాట్లాడుతూ స్టోర్ డీలర్ల విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని, ఇప్పటికే ప్రజల వద్దకు సకాలంలో నిత్యావసర సరుకులను వారి ఇంటి వద్దకే చేర్చడం ఒక్క ముఖ్యమంత్రి కే సాధ్యమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్టోర్ డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img