Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశానికే ఆదర్శం వాలంటరీ వ్యవస్థ

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలంకి చెందిన ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డు ప్రథనోత్సవ కార్యక్రమంలోమండల ప్రజా పరిషత్ సమావేశ భవనం మంగళవారం మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి అధ్యక్షులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ పాల్గొని వాలంటరీ ఉద్దేశించి ప్రసంగించారు 2019లో మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక దాదాపు 25 సంక్షేమ ప‌థ‌కాల‌కు ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే విష‌యంలో కులం, మ‌తం, ప్రాంతం, రాజ‌కీయ పార్టీల‌తో సంబంధం లేకుండా అర్హ‌తే ప్రామాణికంగా పేద‌వాడికి మంచి చేయాల‌ని.. స్వ‌చ్ఛందంగా సేవ‌లందించేందుకు ముందుకు వ‌చ్చిన 2.66 ల‌క్ష‌ల మంది మ‌హా సైన్య‌మే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ ఈ వ్యవస్థ రూపకల్పన దేశానికి ఆదర్శము అని ఆయన తెలిపారు.
దేశంలో మునుపెన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల గ‌డ‌ప ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తూ, పేదలకు మంచి చేయాలని తపన, తాపత్రయంతో అమ‌లు చేస్తున్న 25 సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తి గ‌డ‌ప‌కు నేరుగా వెళ్లి అందజేస్తూన్న వాలంటీర్లకు వరుసగా మూడో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మంచి చేసిన వారిని గుర్తించి 11 పంచాయతీలలో పది గ్రామ సచివాలయం నందు ఉత్తమంగా పనిచేసిన వజ్ర ఒకరికి భాగ్యలక్ష్మి దుద్దేబండ పంచాయతీ అలాగే సేవా రత్న పురస్కారం 4గురికి సేవా మిత్ర మండలంలో 125 మందికి పది సచివాలయ పరిధిలో ఉత్తమంగా పనిచేసిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డు ప్రధాన ఉత్సవాలు చేశామని ఇంకా ఇంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని మరల జగనన్నకు బాసటగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప, తాసిల్దార్ సువర్ణ, మండల ప్రజా ప్రతినిధులు గీతా రామ్మోహన్ రెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండల రాయుడు, 11 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు సంక్షేమ కార్య దర్శులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img