Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దుకాణాల వద్ద తడి, పొడి చెత్తబిన్స్ తప్పక ఉంచాలి

కమిషనర్ వికాస్ మర్మత్
విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్టు డోర్ చెత్త సేకరణలో తడి, పొడి చెత్తను విడివిడిగా అందించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని, ప్రతీ దుకాణం వద్ద డస్ట్ బిన్ లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. స్థానిక 18 వ డివిజన్ శానిటేషన్ మస్టర్ పాయింట్లను కమిషనర్ బుధవారం ఉదయం 6.30 గంటలకు తనిఖీ చేసి శానిటేషన్ సిబ్బంది హాజరును కమిషనర్ పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా హారనాధపురం, ముత్తుకూరు రోడ్డు, సర్వేపల్లి కాలువ, రామలింగాపురం, అండర్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు.
డ్రైను కాలువల్లో క్రమంతప్పకుండా పూడికతీత పనులను చేపట్టాలని, సిల్టు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వీధుల్లోని లిఫ్ట్ పాయింట్ల వద్దనుంచి చెత్తను సేకరించవద్దని, కచ్చితంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ మాత్రమే జరిగేలా పర్యవేక్షించాలని, డివిజను పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని శానిటేషన్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారుఅనంతరం స్థానిక షాపుల నిర్వాహకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్రతీ దుకాణం బయట తడి, పొడి చెత్త సేకరణకు విధిగా డస్ట్ బిన్ లను సాయంత్రంలోపు ఉంచాలని సూచించారు. డస్ట్ బిన్ లను వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించి షాపు ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. షాపుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే షాపు నిర్వహకునికి జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారుతడి, పొడి చెత్తను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించాలని, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని, చెత్తను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చి తిరిగి వినియోగంలోకితీసుకురాగలమని కమిషనర్ ప్రజలకు వివరించారు. వాహనాలకు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో, డ్రైను కాలువల్లో చెత్తను వేయడం వలన దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యాలు కలుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img