Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పరీక్షా సిరీస్‌లో రాణించిన కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ విద్యార్థులు

న్యూదిల్లీ : భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 ఏళ్ల వయసులో ఉన్న వారికి అంతర్జాతీయ విద్యను అందించే అతిపెద్ద సంస్థ కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఇప్పుడు కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐజీఎస్‌సీఈ), కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఏఎస్‌ అండ్‌ ఏ లెవెల్‌ కోసం మార్చి 2023లో నిర్వహించిన పరీక్షా సిరీస్‌ ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 379 పాఠశాలల నుంచి 65,157 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 2023 పరీక్షల సిరీస్‌ భారతదేశంలోని కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ విద్యార్థులకు మరోసారి అద్భుతమైన ఫలితాలను అందించింది. కేంబ్రిడ్జ్‌ ఐజిసీఎస్‌ఇ 5 శాతం, కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఏఎస్‌ అండ్‌ ఏ స్థాయి గత ఏడాది 45,000 దరఖాస్తులతో పోలిస్తే 2022-23 ఏడాదికి 47,800 కన్నా ఎక్కువ దరఖాస్తులతో 12 శాతం వృద్ధి చెందింది. కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఏఎస్‌ అండ్‌ ఏ స్థాయిలో 12 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది 13,833 దరఖాస్తులతో పోలిస్తే 2022-23 ఏడాదిలో 15,600 దరఖాస్తులు వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img