Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

రాళ్లు

కేశవ్‌ గోపాల్‌ సెల్‌: 7989001058 రాళ్లు...రాళ్లు...రాళ్లు మా ఊరంతా రాళ్లమయం! నల్లరాళ్లు, తెల్లరాళ్లు పలకరాళ్లు చిత్ర విచిత్రమైన రకరకాల రాళ్లు! రాళ్లు కొట్టుకుని బతికేవాళ్లూ రాళ్లకు ప్రాణం పోసే వాళ్లూ మా ఊళ్లో ఉన్నారు డొక్కలు మాడ్చుకుంటున్నారు! అంతేకాదు... రాళ్లతో వ్యాపారం చేసి రాళ్లను రూపాయలుగా మార్చుకుంటున్న వాళ్లూ బొక్కసాలు నింపుకుంటున్న వాళ్లూ రాతి గుండెల దుండగులూ ఉన్నారు! భాగ్యవంతులు భవంతులు నిర్మించినా నిర్భాగ్యులు రేతిరి విశ్రమించినా అవే రాళ్లు అవే రాళ్లు బండరాళ్లు...! రాయీ రాయీ ఎందుకు మాట్లాడవంటే
నా గుండెలు
పగలగొట్టారు గదా…
నేనెట్లా మాట్లాడేది…?
ఇది దాని జవాబు!`మరి
మనిషి జవాబేదీ…???

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img