Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అఫ్గాన్‌లో భారతీయులు సహా 150 మంది అపహరణ`సురక్షితం

కాబూల్‌ : అఫ్గాన్‌లోని కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర భారతీయులు సహా 150 మందిని తాలిబన్లు అపహరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్‌ నుంచి వేర్వేరు దేశాలకు వెళ్లే వారిని తాలిబన్లు నిర్బంధించినట్లు తెలిపింది. కొందరు భారతీయులను తాలిబన్లు అపహరించినట్లు అఫ్గాన్‌ సీనియర్‌ జర్నలిస్టులు సైతం ట్వీట్లు చేరారు. దీంతో అపహరణకు గురైన వారి భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. ఇదిలావుంటే తాము అసలు భారతీయులను అపహరించ లేదని తాలిబన్లు ప్రకటించారు. 150 మంది అపహరిం చినట్లు వస్తున్న కథనాలను తాలిబన్‌ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసేక్‌ తోసిపుచ్చారు. ఎవరినీ అపహరించ లేదని, అందరినీ సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకెళ్లామన్నారు. కాబూల్‌ విమానాశ్రయానికి సమీపంలో సాయుధులైన తాలిబన్లు అపహరించిన వారిలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారని, వీరికి హాని తలపెట్టవచ్చని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అపహరణకు గురైనట్లు చెప్పబడే భారతీయులందరితో దౌత్యాధికారులు సంప్రదింపులు జరిపినట్లు వెల్లడిరచాయి. వీరిని కాబూల్‌ నుంచి భారత్‌కు తరలించినట్లు పేర్కొంది. మరోవైపు భారత వైమానిక దళం ఆపరేషన్‌ కాబూల్‌ను శనివారం ఉదయం ప్రారంభించింది. భారత వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కాబుల్‌ నుంచి ఉదయం 12 గంటలకు 85 మంది భారతీయులతో బయలుదేరింది. ఆ విమానం తజకిస్థాన్‌లోని దుషాంబేలో సురక్షితంగా దిగినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img