Friday, April 26, 2024
Friday, April 26, 2024

చైనాలో ముగ్గురు పిల్లల విధానం

వృద్ధుల సంఖ్య పెరగడమే కారణం
బీజింగ్‌ : చైనా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతులు జారీచేసింది. జననాల రేటు తగ్గిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎన్నడూ లేని విధంగా జననాల రేటు నెమ్మదించిందని, 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరిగిందని చైనా వెల్లడిరచింది. 2000`10లో జనాభా వృద్ధి రేటు కనిష్టంగా 0.57 శాతం నమోదు కాగా 2016లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేందుకు దంపతులకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినాగానీ ఆశించిన ఫలితాలు లేక ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకు వచ్చింది. చైనాలో నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ 13వ స్టాండిరగ్‌ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై ఆమోదముద్ర పడిరది. పలు చట్టాలకు సవరణలు జరిగాయి. వీటిలోనే జనాభా, కుటుంబ నియంత్రణ చట్టం ఉంది. దీనిని సవరించి ముగ్గురు పిల్లల విధానానికి చైనా ఆమోదం తెలిపింది. సవరిత చట్టం అమలునకూ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంతకంతో అంగీకారం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img