Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కశ్మీర్‌ ముస్లింల గురించి మాట్లాడే హక్కు మాకుంది

తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌
అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా కశ్మీర్‌ విషయంలో తాలిబన్లు మాట మార్చారు. వచ్చిన కొత్తలో కశ్మీర్‌ అంతర్గత విషయమని, అది ఇండియా, పాకిస్థాన్‌ ద్వైపాక్షిక అంశమన్న వాళ్లు.. ఇప్పుడు కశ్మీర్‌ ముస్లింల గురించి మాట్లాడే హక్కు తమకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్‌ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. కశ్మీర్‌తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ స్పష్టం చేశారు. అయితే ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్టబోమని కూడా అతను స్పష్టం చేశారు. ముస్లింలు మీ సొంత మనుషులు, మీ దేశ పౌరులు. మీ చట్టాల ప్రకారం వాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలని మేము గళమెత్తుతాం అని షహీన్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img