Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌
పాఠశాలల పనితీరు, సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి పాఠశాలలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాప్‌కు కూడా వందశాతం వ్యాక్సినేషన్‌ వేయించాలని కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు సూచించారు.విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర స్టాఫ్‌ అందరూ వ్యాక్సినేషన్‌ వేసుకున్నట్టు తెలిసేలా ప్రతి పాఠశాల వద్ద బ్యానర్‌లను కట్టాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పంపిణీలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని ఏ విద్యార్థికైనా, సిబ్బందికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి కోవిడ్‌ పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీపీవోలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img