Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కోతకు గురైన వరహానది గట్టు

ఉదృతంగా వరహానది
విశాలాంధ్ర – యస్‌. రాయవరం :విశాఖపట్నం జిల్లా యస్‌. రాయవరం మండలం పెనుగొల్లు పంచాయతీ పరిధిలోని సోముదేవపల్లి వద్ద వరహానది గట్టు కోతకు గురైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు తో వరహానది ఉదృతంగా ప్రవహిస్తోంది. 2019 సంవత్సరంలో ఈ గట్టు కోతకు గురైన విషయం తెలిసిందే. ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు తాత్కాలిక పనులు నిమిత్తం సుమారు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అ పనులు పూర్తి చేయడం జరిగింది. గట్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అక్కడే ఉన్న మూలపాలెం గ్రోయిన్‌ వలన నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇప్పుడు వరకు సుమారు 40 అడుగుల గట్టు దెబ్బతిన్నంది. పాత సోముదేవపల్లి, కొత్త సోముదేవపల్లి గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంను యలమంచిలి ఇరిగేషన్‌ డీఈ సుజాత, ఎఇలు చిన్నారావు, బాను, పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img