Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పెత్తందారుల దుకాణాల ఎదుట గోతులకే రోడ్డు మరమ్మత్తులు …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.25.04.2024ది. చోడవరం బి.ఎన్.రోడ్డులో పెత్తందారుల దుకాణాల ఎదుట పడిన గోతులకు తారు రోడ్డు మాస్కులు వేసి మమ అనిపించేసారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తాజా మాజీ ఎమ్మెల్యే, వై.సీ.పీ అభ్యర్ధి కరణం ధర్మ శ్రీ స్వంత నిధులతో వేసిన హడావుడి రోడ్లు పలు విమర్శలకు తావిస్తోంది. స్వచ్ఛందంగా సేవ చేసే తత్త్వమే వుంటే బి.ఎన్. ప్రధాన రహదారిలో చాలాచోట్ల గోతులు వదిలి, పెత్తం దారులు, బడాబాబులు ఇళ్ల వద్ద తారు రోడ్డు పై మాస్క్ లు వేయడం పై పలు ఆరోపణలున్నాయి. “స్వంత లాభం, కొంత మాను” అంటూ సీనియర్లు హితవు పలుకుతున్నారు. నిన్నటి వరకు రోడ్లు మరమ్మత్తులకు లేని నిధులు, గుత్తేదారులకు ఏ విదంగా వచ్చాయి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img