Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏసుప్రభువు పరిపూర్ణ మానవుడే కాదు- సాక్షాత్తు దేవుడే.. పాస్టర్ మల్లెల రమేష్

విశాలాంధ్ర- ధర్మవరం : ఏసుప్రభువు పరిపూర్ణ మానవుడే కాదు సాక్షాత్తు దేవుడేనని పాస్టర్ మల్లెల రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగుంట లోని చర్చిలో శుక్రవారం క్రైస్తవ సోదర సోదరీమణుల నడుమ ఘనంగా గుడ్ ఫ్రైడే ను నిర్వహించుకున్నారు. తొలుత పాస్టర్ మల్లెల రమేష్ బైబిల్ లోని ముఖ్యమైన ఘట్టాలను చదివి వినిపించారు. అనంతరం పాస్టర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రై డే యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, క్రైస్తవుని యొక్క సందేశాలను వినిపించారు. క్రీస్తు మరణానికి సంబంధించిన దే గుడ్ ఫ్రైడేనని, సకల మానవాళి కళ్యాణం కోసం మరణాన్ని ఆహ్వానించిన క్రీస్తులోని అనంతమైన ప్రేమకు కారణం ఈ శుభశుక్రవారం అని తెలిపారు. ఈస్టర్ మరణించిన క్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధానం పొందిన రోజు అని తెలిపారు. ఏసుప్రభు మహిమను లోకానికి వెల్లడించడానికి, ఇది దోహద పడిందని, ఆయన త్యాగపూరితమైన మరణం, ఆయన పునరజీవానికి కారణమైన ఆ శుక్రవారం నే శుభశుక్రవారం అని పలుకుతారని తెలిపారు. క్రైస్తవ విశ్వాసులు దాన్ని గాడ్ ఫ్రైడే గా కూడా భావించడం జరుగుతుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే అనే మాట ఒక మహా మహిమ వల్ల కలిగిన గొప్ప ఫలితాన్ని సూచిస్తుందని తెలిపారు. లోకానికి కావలసినది ఏమిటో ఏసుప్రభువు బోధించాడని తెలిపారు. ఏసుప్రభు అద్భుతాలతో పాటు అర్థం కాని వారి కోసం తన మహిమలేవి ప్రకటించకుండా, సాదాసీదా వ్యక్తిగా ప్రాణాలు అర్పించాడని తెలిపారు. ఆ తర్వాత తనదైన సహజ దైవ శక్తితో మరణము నుంచి తిరిగి లేయడమే ఈస్టర్ అని తెలిపారు. పాప భూయిష్టమైన నరుడి దుష్ప్రవర్తన త్యాగపూరితము కావాలని, ప్రేమ భరితం కావాలని, సేవా రూపంలోకి పరిణామం చెందాలని, తనలోని చెడును తొలగించుకొని, పరిపూర్ణ మానవుడిగా పునరుత్థానం చెందాలన్నదే గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్యమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img