Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐ.ఓ.సీ డిపోలో హెచ్‌. ఐ. వి /ఎయిడ్స్‌ పై అవగాహన,హెచ్‌.ఐ వి పరీక్షలు.

విశాలాంధ్ర-గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీ.యస్‌.నవీన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్‌ నియంత్రణ వారి సూచనల మేరకు, ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ న్యూ గుంతకల్‌ డిపో సహకారంతో ప్రగతి మైత్రి మహిళా సంఘం వారి అధ్వరంలో శనివారం ట్రక్‌ డ్రైవర్స్‌, క్లినర్స్‌ సుమారు 210 మంది కి హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ పై అవగాహన కల్పించడంతో పాటు హెచ్‌. ఐ. వి పరీక్షలు చేయటం జరిగింది.ఈ సంధర్బంగా ప్రగతి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రమేష్‌ మాట్లాడుతూ హెచ్‌.ఐ.వి. కేవలం 4 రకాలుగా వస్తుందని అన్నారు.1. సురక్షతంకానీ లైంగిక సంబంధాలు,2. కలుషిత సూదులు ,సిరంజీలు వాడటం ద్వారా,3. కలుషిత రక్త మార్పిడి ద్వారా,4. హెచ్‌.ఐ.వి. సోకిన తల్లి నుండి బిడ్డకు వస్తుందని తెలిపారు.అదేవిదంగా హెచ్‌.ఐ.వి. వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రతలు మరియు, హెచ్‌.ఐ.వి. ఉన్న గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డలకు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. యువతకు హెచ్‌.ఐ.వి గురించి అవగాహన లేకపోవడం సామాజిక మాధ్యమాలు, చెడు సహవాసాల కారణంగా హెచ్‌.ఐ.వి కి ఎలా గురి అవుతారు అనే విషయాల పై అవగాహన కల్పించారు. హెచ్‌.ఐ.వి సోకిన వ్యక్తిని వివక్షకు గురిచేయరాదని, హెచ్‌.ఐ.వి పరీక్షలు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి లో ఉచితంగా చేస్తారని, హెచ్‌.ఐ.వి సోకిన ప్రతి వ్యక్తికి ఏ.ఆర్‌.టి సెంటరులో ఉచితంగా మందులు ఇస్తారని, వాటి ద్వారా వారియొక్క జీవిత కాలాన్ని పొడిగించుకునే వీలుందని, అలాగే న్యాకో యాప్‌ ,1097 టోల్‌ ఫ్రీ కి కాల్‌ చేసి హెచ్‌ ఐ వి పై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రగతి మైత్రి మహిళా సంఘం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రమేష్‌ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ డిపో మేనేజర్‌ కె.నవీన్‌ కుమార్‌ , సీనియర్‌ మేనేజర్‌ దాస్‌ ప్రసాద్‌ , ఐఓసి లైసెనర్‌, జి. ఏ.నజీర్‌, మేనేజర్‌ హరికృష్ణ, సుధీర్‌, సెక్యూరిటీ చీఫ్‌ హుసేన్‌ పీరా, ట్యాంకర్‌ డ్రైవర్‌ క్లీనర్‌ అసోసియేషన్‌ నాయకులు హునుమేశ్‌, చిన్న వలి ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సిబ్బంది, ప్రగతి మైత్రి మహిళా సంఘం ఎం.ఈ.ఏరాధ,ఏ.ఎన్‌ .ఎం నజు మున్నిసా,ఓ ఆర్‌ డభ్ల్యూ ఎస్‌ లక్ష్మిదేవి, భూలక్ష్మి,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img