Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఓటు హక్కు మన చేతిలో వజ్రాయుధం.. ఆర్డిఓ తిప్పే నాయక్‌

విశాలాంధ్ర- ధర్మవరం: ఓటు హక్కు మన చేతిలో వజ్రాయుధం లాంటిదని ఆర్డీవో తిప్పేనాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆర్డిఓ కార్యాలయ సమావేశ భవనంలో ధర్మవరం అర్బన్‌, రూరల్‌ పరిధిలోగల 153 మంది బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లకు ఓటు నమోదు కార్యక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో తిప్పే నాయక్‌ మాట్లాడుతూ ఓటు హక్కుతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ, ఓటు హక్కును తప్పక కలిగి ఉండాలని తెలిపారు. ఓటు హక్కు పై యువతకు చైతన్యం తెచ్చేలా కృషి చేయాలని బిఎల్‌ఓ లకు సూచించారు. ఓటు హక్కుతోనే మంచి నాయకులను, సమాజ సేవకులను, మనల్ని పరిపాలించే నాయకులుగా మలుచుకోవడానికి అద్భుత అవకాశం ఉంటుందని తెలిపారు. మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారానే సమాజ అభివృద్ధి, తద్వారా దేశ పురోగతి జరుగుతుందని తెలిపారు. మనకున్న ఓటు హక్కును ఎన్నికలలో విధిగా ఉపయోగించుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. ఈనెల 10వ తేదీన ఎలక్ట్రోల్‌ పరిశీలకులు మురళీధర్‌ రెడ్డి రానున్న సందర్భంగా బిఎల్‌ఓ లందరూ ఈనెల 3, నాల్గవ తేదీలలో తమ పోలింగ్‌ స్టేషన్లో ఫారం-6, ఫారం -7 లపై తమ తమ బూత్‌ కేంద్రాలలో ప్రజలకు అవగాహన కల్పించి, క్లెయిమ్స్‌ లను స్వీకరించి, వెనువెంటనే కంప్యూటర్లో నమోదు చేయాలని తెలిపారు. ఫార%శీ%-6 ద్వారా నూతన ఓటర్ల నమోదు, ఫారెన్‌-7 ద్వారా తొలగింపులు, ఫారం-8 ద్వారా సవరణలు గల వాటిని భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి డిసెంబర్‌ మూడవ తేదీ వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఫారం-6 రూరల్‌, అర్బన్‌ లలో 1989, ఫారం-7 లో 4205, ఫారం-8 లో సవరణలు 857, షిఫ్టింగులు 354 పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకనూ పెండిరగ్‌ లో ఉన్న 2,450 తొందరలో పూర్తి చేయాలని బిఎల్‌ఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల తాసిల్దార్‌ అనిల్‌ కుమార్‌, సిబ్బంది రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img