Friday, April 26, 2024
Friday, April 26, 2024

చిన్నారులలో న్యుమోనియా వ్యాధి నివారణపై అవగాహన

విశాలాంధ్ర`అనంతపురం : చిన్నపిల్లల్లో న్యుమోనియా వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం ప్రభుత్వ ఆసుపత్రి లోని చిన్నపిల్లల విభాగంలో అనంతపురం జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డా. యుగంధర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఫిబ్రవరి 28, 2023 వ సంవత్సరం వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. బాల్యం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలంటే న్యుమోనియా లక్షణాలను వెంటనే గుర్తించాలని సూచించారు. న్యుమోనియా ఒక ప్రమాదకరమైన వ్యాధి అని..5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు అతిముఖ్యమైన కారణం.. సమయం వృథా చేయకుండా న్యుమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు దగ్గు ,జలుబు ఎక్కువగా ఉండటం ఎక్కువసార్లు వేగంగా శ్వాస తీసుకోవడం ఛాతీ లోపలికి పోవడం, అధిక జ్వరం ఉండడం, శ్వాస తీసుకునే సమయంలో గురకరావడం, నీరసంగా మత్తుగా ఉండడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు అని తెలిపారు. ఈ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి ఐదు సంవత్సరాలు లోపు పిల్లల తల్లులను గుర్తించి వారికి న్యుమోనియా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం నిమోనియా వ్యాధి నివారణ అవగాహన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో, హెచ్‌ ఓ డి డా.సుహాసిని ,డాక్టర్‌ పుష్పలత, సుబ్రహ్మణ్యం హెచ్‌ ఈ , త్యాగరాజు ఎం పి హెచ్‌ ఈ ఒ, శ్యామ్యూల్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img