Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతినీ దగ్ధం చేసిన సిపిఐ నాయకులు


విశాలాంధ్ర- ధర్మవరం : సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపుమేరకు ప్రజాస్వామిక హక్కులను కాలరాసే ప్రభుత్వ జీవో నెంబర్ వన్ ప్రజలను శనివారం సిపిఐ నాయకులు భోగిమంటల్లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ పార్లమెంటు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు లేదంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ దస్కర్ చెప్పడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగుతోందని వారు విమర్శించారు. గత సాంప్రదాయాలకు భిన్నంగా జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను జారీ చేసి.. ప్రతిపక్షాలను, ప్రజాసంఘాల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించిందని వారు ధ్వజ మెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని తెలిపారు. చీకటి జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడం శుభ పరిణామం అని తెలిపారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి జీవోలను తేవడం దేశంలో ఆంధ్రప్రదేశ్లో మొదటిదని వారు తెలిపారు. జీవో నెంబర్ వన్ ను రద్దు కోసం, ప్రశ్నించే గొంతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి పార్టీల ఉద్యమాలను, అణిచి వేయడానికే, చీకటి జీవోను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి ఆలోచన లేకపోవడం ప్రజల దురదృష్టకరమని, ఒక్క ఛాన్సు అని, ఆంధ్రప్రదేశ్ను అప్పులు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రవికుమార్ సహాయ కార్యదర్శి రమణ చేనేత సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటనారాయణ వెంకటస్వామి ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సకల రాజా తోపాటు శ్రీనివాసులు, శంకర, రంగయ్య, భుజంగం, ఆది, చెన్నంపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img