Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నిరసన చేపట్టారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014వ సంవత్సరముముందు లోటు 1.2 మిలియన్ యూనిట్లు లోటు ఉండేది. 2019వ సంవత్సరము నాటికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోటు నుండి మిగులు విద్యుత్ తెచ్చిన ఘనత మా నాయకుడిది అని తెలిపారు. 2019వ సంవత్సరము నుండి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని తెలిపారు. పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మొత్తం రూ. 57,188 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జెన్కో, సీజిఎస్ లలో ఒక యూనిట్ విద్యుత్ సరాసరి రూ. 5/- లకే వస్తున్నది . కానీ ప్రభుత్వ సంస్థలలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలిపివేసి కమిషన్ల కోసం ఒక యూనిట్ సరాసరి రూ.9/- పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసారు. బహిరంగ కొనుగోళ్లకు రూ.12,200 కోట్లు ఖ్జర్చు చేసారు. ఈ వేసవి కాలములో ప్రజలకు విద్యుత్ అంతరాయము లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. దానికి తోడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటలలోపు వాటిని పునరుద్ధరణ చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. మోటర్లకు మీటర్లు బిగిస్తే వాటిని పగులకొడతామని బికె పార్థసారథి హెచ్చరించారు. ప్రజలకు, రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img