Friday, April 26, 2024
Friday, April 26, 2024

శంకర్ నారాయణ నోరు అదుపులో పెట్టుకో

కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నందు బుధవారం సవితమ్మ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మంగళవారం రోజున పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ చేసిన వ్యాఖ్యలకు బుధవారం వీరు శంకర్ నారాయణ పై ఘాటుగా వ్యాఖ్యానించారు సవితమ్మ కులం గురించి ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెనుకొండ నుంచి ధర్మవరంకు తరిమి తరిమి కొడతాం తస్మాత్ జాగ్రత్త నీకి ఏమైనా సిగ్గు, శరం, రోషం ఇంకా ఏమైనా ఉంటే ధర్మవరంలో రాజకీయం చేసి అక్కడ పోటీ చేయగలవ నీ సొంత ఊరిలో కనీసం ఫ్లెక్సీ కట్టుకోలేని నిస్సహాయ రాజకీయ నాయకుడివి నీవు పెనుకొండలో వచ్చి అందర్నీ విమర్శించడం చూస్తూ ఉంటే గురిగింజ సామెత కనబడుతుందని మీ పార్టీలో ఉన్న కులాల కుమ్మలాటలు గురించి తిరిగి చూసుకోండి
నీ మంత్రి పదవి తొలగించి ఉషశ్రీ రెడ్డి రెడ్డి సామాజికవర్గశీ నికి మంత్రి పదవి ఇచ్చినపుడు జగన్ మోహన్ రెడ్డి ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు. ఎమ్మెల్యే శంకర్నారాయణ , శింగనమల లో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా జొన్నల గడ్డ పద్మావతి సాంబశివారెడ్డి (రెడ్డి సామాజికవర్గం) ఇచ్చినపుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావు ఎమ్మెల్యే శంకర్నారాయణ మీ పార్టీలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న కోటి బాబు భార్యది ఏ కులం రెడ్డి కులం కాదా కురబ సామాజిక వర్గానికి చెందిన 14 శాఖలకు తెదేపా మంత్రి గా పనిచేసిన కురబ రామచంద్ర రెడ్డి కురబ గాయిత్రమ్మ గారి కుమార్తె సవితమ్మ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తుంటే ,ఓడిపోతాననే భయం తో శంకర్నారాయణ కి ఓటమి దిగులుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ప్రజలంతా గమనిస్తున్నారు మీ వంకరమాటలను.నువ్వు కురుబ కులస్తుడు అంటావు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యావు నియోజకవర్గంలో గాని, రాష్ట్రంలోని ఎక్కడైనా ఒక కనకదాసు విగ్రహాన్ని అయిన కూడా విరాళం చేశావా ఒక కురుబ కులస్తుడికైనా ఆదుకున్నావా శంకర్ నారాయణ .జిల్లాలోనూ చాలా చోట్ల కనకదాసు విగ్రహాలను విరాళంగా ఇచ్చిండేది సవితమ్మ నియోజకవర్గంలో చాలా చోట్ల కురువ సంఘం మీటింగ్ జరిపి ఆ వేదికను పంచింది కూడా సవితమ్మ గారే.నీకు చేతనైతే వచ్చే ఎన్నికల్లో సవితమ్మ పై రాజకీయంగా ఎదుర్కో అంతే కానీ కులంపై ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి రాంపురం పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసులు మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు గుట్టురు, మాజీ సర్పంచ్,
సూర్యనారాయణ ఆడ దాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, మాజీ వైస్ సర్పంచి సుబ్రహ్మణ్యం త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి కౌన్సిలర్ గీతా హనుమంతు ,మారుతి , వాసుదేవరెడ్డి, మణికంఠ ,వెంకటేష్ వీరచిన్న మంజు, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img