Friday, April 26, 2024
Friday, April 26, 2024

సంక్షోభంలో చేనేత పరిశ్రమ

విశాలాంధ్ర – ధర్మవరం : నేడు చేనేత పరిశ్రమలో ఎప్పుడూ కూడా కనీ,వినీ, ఎరుగని సంక్షోభంలో పడడంతో చేనేత కార్మికుల ఉపాధి అతలాకుతలమవుతోందని, ఇందుకు కారణం పెడచెవిన పెట్టిన పాలకవర్గ వర్గమేనని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నమ్ముకొని ఉన్న వృత్తి అయిన చేనేతను చేద్దామంటే పని లేదు.. చేసిన పనికి కూలి లేదు.. నేద్దా మంటే మగ్గమే లేదు.. నేసిన చీరకు గిట్టుబాటు ధర లేదని అన్నట్లు.. నేడు చేనేత కార్మికుల పరిస్థితి తయారయిందని, మాకు దారేంటి? మా భవిష్యత్తు ఏంటి అని చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. మరమగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారు కలకత్తా నుండి నేతగాలుగా తెచ్చి, తక్కువ వేతనాలకు చీరలను వేయించుకుంటున్నారని, 25 శాతం మించి బయటవారిని నియమించుకోకూడదు.. అన్న నిబంధనలు కూడా తుంగలో తొక్కుతున్న కూడా అధికారులు.. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని వారు తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా నేడు మాస్టర్ వీవర్స్ మగ్గాల కోసం ఇండస్ట్రియల్ లో అప్పులు, సబ్సిడీ తీసుకొని, అక్కడే పవర్ లూమ్స్ చీరలను వేసి వాటిని చేనేత చీరలుగా చూపిస్తూ చేనేత రిజర్వేషన్ చట్టానికి తూట్లు చేస్తున్నారని వారు దుయ్య బట్టారు. నేసిన చీరకు గిట్టుబాటు లేకపోవడం జరుగుతోందని, ఇందుకు కారణం అవసరానికి మించి ఉత్పత్తి కావడం అని తెలిపారు. పవర్ లూమ్స్ లో చేనేత డిజైన్లు వేయడం వలన, చేనేత పరిశ్రమలు కుంటుపడుతున్నాయని, తీవ్రమైన ఉపాధిని కూడా చేనేత కార్మికులు కోల్పోతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా చేనేతను నమ్ముకున్న చేనేత కార్మికులు అప్పులు, అధికము కావడం వలన చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా..!! కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి పట్టినట్టు వ్యవహరించడం దారుణము కాదా? అని వారు ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ మాస్టర్ వీవర్స్ కు ముందుగానే సమాచారం అందించడం, లంచాలకు పాల్పడడం లాంటివి జరుగుతున్నందునే నేడు చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందలేకపోతుందని తెలిపారు. చేనేత పరిశ్రమను కాపాడవలసిన వారే పవర్ లూమ్స్ కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అర్థం కాలేదని వారు తెలిపారు. పవర్లూమ్స్ పై ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేయలేకపోతున్నారో .. చేనేత పరిశ్రమను కాపాడవలసిన బాధ్యత అధికారులకు లేదా? అని తెలుపుతూ అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. అందుకనే చేనేత పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 25వ తేదీన చేనేత కార్మికులతో అత్యధిక సంఖ్యలో సమావేశం అవుతామని, ఇక్కడ తీసుకునే నిర్ణయాలు తీవ్రమైన పోరాటాలకు నాంది అవుతుందని వారు హెచ్చరించారు. ఆ నిర్ణయాలను ప్రభుత్వాలు అమలుపరిచేంతవరకు మా పోరాటాలు ఆపమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఆది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img