Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించండి..సీపీఐ వినతి

విశాలాంధ్ర-గుంతకల్లు : జగనన్న కాలనీలో ఎల్ పి నెంబర్ ఏడులో నీటి సమస్య మోటర్లు సమస్య అనేక సమస్యలు నెలకొన్నాయని తక్షణమే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బుధవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు ప్రజానాట్యమండలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ ,పుల్లయ్య వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా జగనన్న కాలనీలో నివాసాల నిర్మాణానికి నీటి సమస్య విపరీతంగా మారిందన్నారు. అయితే నీటి బోరు మోటర్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు బోర్లు రిపేరు చేసి నిర్మాణాలకు నీటిని అందించేందుకు పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉమ్మర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img