Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

రైతులకు విత్తనాలు మందులు అందుబాటులో ఉంచాలి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండల వ్యవసాయ కార్యాలయం నందు శుక్రవారం మండల వ్యవసాయ అధికారి నటరాజ్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల అగ్రి చైర్మన్ పాల్గొని ఆర్ బి కే సిబ్బంది కి వ్యవసాయ అధికారులకు సలహాలు సూచనలు చేశారు ప్రతి ఆర్ బి కే కేంద్రం నందు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి విత్తనాలు ఎరువులు అందరికీ అందుబాటులో ఉంచాలని నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసి రైతులకు మంచి సలహాలు ఇచ్చి రైతుల నష్టపోకుండా చూడాలని అలాగే నకిలీ పురుగుమందుల విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని రైతుల నష్టపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం ప్రతి కార్డు దారికి బియ్యం కు బదులుగా రాగులు పంపిణీ చేస్తున్నారని అందువలన ఎక్కువ భాగం రైతులకు రాగి పంట వేయించడానికి ఆర్ బి కే సిబ్బంది కృషి చేయాలని విత్తనాలు 50% సబ్సిడీతో అందుబాటులో ఉంచామని అలాగే రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించడానికి కృషి చేస్తున్నామని కావున ఎక్కువ భాగం విస్తీర్ణం పెంచడానికి రైతులతో మమేకమై రాగి పంట వేయించడానికి కృషి చేయాలని రాగివలన ఎన్ని పోషక విలువలు ఉండే విషయాన్ని తెలియజేస్తూ వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని వారు తెలిపారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ అధికారి నటరాజును మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొండలరాయుడు సన్మానించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img