Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అప్పర్‌ భద్రతో రాయలసీమకు ముప్పు !

హెచ్ఎల్సీ ఆధునీకరణ,

అప్పర్ బద్ర ప్రాజెక్టు ఆపాలని,

సమాంతర కాలువకు అనుమతులు ఇవ్వాలని

ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్న సిపిఐ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్

కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ బద్ర ప్రాజెక్టు వల్ల కర్ణాటకలోని బళ్లారి, రాయలసీమలోని అనంతపురం,కర్నూలు,కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు, అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్య అవకాశాలు ఏర్పడ్డాయని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్ అన్నారు. మంగళవారం ఉరవకొండలో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో త్వరలో జరిగే ఎన్నికలలో లబ్ది పొందడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు అయినా అప్పర్ భద్ర నిర్మాణానికి 5300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దీనికి కేంద్ర జల శక్తి మండలి ఆమోదం తెలపడమే కాకుండా జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించడం శోచనీయమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లాకు రావలసిన 1.40 లక్షల ఎకరాలకు సంబంధించి సాగునీరు మరియు హంద్రీనీవా కాలవ నుంచి రావలసిన 2.50 లక్షల ఎకరాలకు నీరు అందక రాయలసీమ రైతులు మరియు ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తుంగభద్ర ఉప నది నుంచి వస్తున్న నీరు కూడా రాక ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఇది అక్రమ ప్రాజెక్టు అని దీనికి బచావత్ ట్రిబ్యునల్ లో ఎలాంటి నీటి కేటాయింపులు కూడా లేవని తెలిసి కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో లబ్దికోసం రాయలసీమ ప్రజలకు మరియు రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అప్పర్ బద్ర ప్రాజెక్టు కు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏపీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అధికారులతో సమావేశం నిర్వహించిందని రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు రాష్ట్రం నుంచి అధికారులను సమావేశానికి పంపకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. సమాంతర కాలువ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అనేక రోజులుగా సిపిఐ పార్టీ మరియు రైతు సంఘాలు పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ సమాంతర కాల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల రాయలసీమ జిల్లాల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి సిపిఐ పార్టీ మరియు రైతు సంఘం సంయుక్తంగా ఏప్రిల్ నెలలో ఆందోళన మరియు ప్రచార కార్యక్రమాలను హంద్రీనీవా కాలువ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలు, సమావేశాలను నిర్వహించి కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న మోసాల గురించి తెలియజేస్తామన్నారు ప్రధానంగా మూడు అంశాలపై తమ ప్రచార కార్యక్రమం ఉంటుందని హెచ్.ఎల్.సి కాలువ ఆధునికరణ చేపట్టాలని, అప్పర్ భద్ర నిర్మాణం ఆపాలని, సమాంతర కాలువకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్లతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సంఘం నాయకులు గోవిందు, సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, పార్టీ సీనియర్ నాయకులు శివన్న, ఉరవకొండ పార్టీ మండల కార్యదర్శి మల్లికార్జున, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, రైతు సంఘం నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img