Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటువేస్తే తీవ్రంగా ఉద్యమిస్తాం

ఏపీ ఎన్జీవోసంఘం జిల్లాఅధ్యక్షుడు కిషోర్

విశాలాంధ్ర, పార్వతీపురం:రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటుమొదలైందని ఒకపత్రికలో వచ్చినవార్తవల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాదిమంది పొరుగుసేవ ఉద్యోగులు ఆందోళన చెందుతున్న సంధర్భంగా ఎన్ జి ఓ పార్వతీపురం మన్యంజిల్లా అధ్యక్షుడు జివిఎస్ కిషోర్ స్పందిస్తూ అటువంటి పరిస్థితి ఏర్పడితే ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు.సోమవారం ఆయన జిల్లా ఎన్జీఓ హోంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ అర్ధాంతరంగా మమ్ములను తొలగిస్తే, మాజీవితాలు ఏమయిపోవాలని అనేకమంది మాకు సామాజిక మాధ్యమాల ద్వారా వారి ఆవేదనను తెలియపరచారని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులను ఏపీఎన్జీవో అసోసియేషన్ పక్షాన ప్రభుత్వమెమో గురించి వివరాలు కోరిందని ఆయన అన్నారు.ఈమెమో కేవలం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ శాఖలో పదేళ్లలోపు పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులకు మాత్రమేనని, కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో మాత్రమే వాళ్ళకిఇచ్చినట్లు తెలిపారని చెప్పారు.మిగిలిన ఏశాఖలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులకు – ప్రస్తుతం వర్క్స్ & అకౌంట్స్ లో వారికిచ్చిన ఆమెమోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి పొరుగుసేవల ఉద్యోగులను ఎవరినీ తొలగించే ఆలోచన లేదని రాష్ట్రఎన్జివో సంఘం నాయకులకు ఇప్పటికే చెప్పారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో అనేకశాఖలలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులు ఎవరూ
ఈమెమోపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి. రవణ కూడా ఒకప్రకటనలో ఇప్పటికే తెలిపినట్లు ఆయనఅన్నారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పదిసంవత్సరాలలోపు పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియఅన్యాయమని ప్రభుత్వానికి తమ సంఘనాయకులు విజ్ఞప్తి చేసినట్లు ఆయనతెలిపారు.
అలాగే ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ లో పదేళ్ల లోపు పనిచేసే పోరుగుసేవ ఉద్యోగులను విదులనుండి తొలగించాలని తే1.12.2022దీన ఇచ్చిన మెమోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో మరియు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పక్షాన ప్రభుత్వాన్ని కోరిందన్నారు. వారు పనిచేసే డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ & అకౌంట్స్ లో ఏదైనా ప్రత్యేక కారణాలుఉంటే, అందులో పనిచేసి పోరుగుసేవల ఉద్యోగులను మరొక శాఖలో సర్దుబాటుచేయాలి తప్ప ఇలా తొలగించాలని మెమో ఇవ్వడం భావ్యం కాదని ఆయనఅభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా సచివాలయ,వార్డు ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా వెంటనే జరపాలని, వేతన వ్యత్యాసాలను సరిచేయాలని,వారిపై పనిఒత్తిడి తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img