Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.. రోటరీ క్లబ్ ప్రతినిధులు

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణం లోని కోట మున్సిపల్ పాఠశాలలో ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ కార్యదర్శి రామకృష్ణ, క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాంస్కృతిక మండలి లో శిబిర కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్బు,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి చూపు లేని వారందరికీ కూడా కంటి చూపును తెప్పించడమే మా క్లబ్బు లక్ష్యమన్నారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు సంకు లక్ష్మీదేవమ్మా జ్ఞాపకార్థం, భర్త సంకు చలపతి, కుమారులు సంకు ప్రసాద్, సంకు బాలకృష్ణులు వ్యవహరించగా, రవాణా సౌకర్యమును కీర్తిశేషులు ఉలిక్కి రెడ్డి కుమారుడు రామచంద్ర రెడ్డి అండ్ మిత్రబృందం వ్యవహరించనున్నారని తెలిపారు. కావున ఈ అవకాశమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సుదర్శన్ గుప్తా, శివయ్య ,బీవీ చలాశీ, సోలిగాల వెంకటేశులు, సత్రశాల ప్రసన్నకుమార్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img