Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

తొగటవీర క్షత్రియ జిల్లా ఉపాధ్యక్షులుగా బీరే శేఖర్‌

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లా తొగటవీర క్షత్రియ కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉరవకొండ పట్టణానికి చెందిన బీరే శేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అనంతపురంలో తొగటవీర క్షత్రియ కళ్యాణమండపంలో కుల గురువు దివ్యజ్ఞాననంద స్వామీజీ మరియు కులం పెద్దల సమక్షంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బండి శ్రీనివాసులు తో పాటు బీరే శేఖర్‌ కూడా జిల్లా కమిటీ లో ఎంపిక కావడంవల్ల ఉరవకొండ నియోజకవర్గ తొగటవీర క్షత్రియ కుల ప్రజలు తమ ఆనందాన్ని, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శేఖర్‌ మాట్లాడుతూ జిల్లా కుల సంఘం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తోట వీర క్షత్రియ కుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img