Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

దేవాలయమునకు వెండి శ్రీ చక్రం తొడుగు బహూకరణ

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయమునకు బెంగళూరు వాస్తవ్యులు కాసెట్టి శ్రీనివాసులు (వరలక్ష్మి గ్రూప్) వారు మంగళవారం మూడు కేజీల 500 గ్రాములు బరువు గల వెండితో తయారుచేసిన శ్రీ చక్రం తొడుగు(విలువ రూ .2,50,000)ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి వెంకటేశులు (చిట్టి) కు సమర్పించారు. అనంతరం దాత పేరున ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img