Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షలతో అభివృద్ధి పనులు

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
ప్రతి సచివాలయం పరిధిలో కూడా వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ,20 లక్షల మంజూరు చేసిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఉరవకొండ పట్టణంలో మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే 50 సచివాలయల పరిధిలో రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయిలు ఇవ్వడానికి మరో రూ.12 కోట్ల నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందన్నారు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజల యొక్క కనీస అవసరాలైన తాగునీరు,విద్యుత్తు, రోడ్లు డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, పార్టీ నాయకులు మరియు మంత్రులపై కనీస సంస్కారం లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయనకు ఇవే చివరి ఎన్నికలని తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ లలిత, ఉప సర్పంచ్‌ వన్నప్ప, వైస్‌ ఎంపీపీ నరసింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు ఓబులేసు, పార్టీ నాయకులు బసవరాజు, ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్‌, మల్లికార్జున,రాజు,ఏసీ ఎర్రి స్వామి, వార్డ్‌ సభ్యులు ప్రభాకర్‌, ఓబులమ్మ గాది లింగ, పామిడి జాకీర్‌, పచ్చి రవి, తో పాటు పంచాయతీ అధికారులు, సిబ్బంది వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img