Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

మంత్రి పర్యటన సందర్భంగా సిపిఐ నాయకులు అరెస్ట్‌

విశాలాంధ్ర`ఉరవకొండ : జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉరవకొండ పట్టణంలో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనందుకు హాజరవుతుండగా మంత్రి పర్యటనను ఎక్కడ అడ్డక్కుంటరోనని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా సహాయ కార్యదర్శి మరియు ఎంపీటీసీ సభ్యులు అయిన వన్నూరు సాహెబ్‌ ను, విద్యార్థి సంఘం నాయకులు చిరంజీవిని శనివారం ఉదయం ఉరవకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వన్నూరు సాహెబ్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందక ఇల్లు నిర్మాణాలు ఆగిపోయాయని ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వీటన్నింటినీ సిపిఐ పార్టీ నాయకులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ముందస్తుగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు.రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img