Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మా నమ్మకం నువ్వే జగన్‌్ణకార్యక్రమాన్ని ప్రారంభం

విశాలాంధ్ర- పెనుకొండ : మా నమ్మకం నువ్వే జగన్ః కార్యక్రమాన్ని శుక్రవారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని 1 వార్డు ఇస్లాపురం 2 వార్డ్ 3 వార్డులు వెంకటరెడ్డి పల్లి తిమ్మాపురం, సచివాలయ పరిధిలో గ్రామాలలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూఖ్ ఖాన్ వైస్ చైర్మన్ వైశాలి జయశంకర్ రెడ్డి వైస్ చైర్మన్ సునీల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు, గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింద నీ అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా 1 వార్డ్ ఇంచార్జ్ గోపాల్, 2వార్డ్ కౌన్సిలర్ శేషాద్రి, 3 వార్డు పార్టీ ఇంచార్జ్ వెంకటేశులు , తిమ్మారెడ్డి,సచివాలయ కన్వీనర్ రాము ,సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img