Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మాతా – శిశు మరణాలపై సమీక్ష

విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ భవనం లో మంగళవారం మాతా – శిశు మరణాల మీద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(ఎఫ్‌. ఏ. సి.) డా. యుగంధర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా లో జరిగిన రెండు మాతృ మరణాలు, ఆరు శిశు మరణాల మీద సమీక్ష జరిపి సంభందిత వైద్యాధికారులు తయారు చేసిన నివేదిక లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…క్షేత్ర స్థాయిలో గర్భవతులలో సాధారణంగా కనిపించే రక్త హీనత, అధిక రక్త పోటు సమస్య ల ను త్వరగా గుర్తించి తగు సూచనల ను సంభందిత వైద్యాధికారులు ఎప్పటి కప్పుడు అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను అరికట్టవచ్చు అన్నారు. వైద్య సిబ్బంది గర్భవతులకు మరియు బాలింత ల కు అందించే సేవల్లో ఖచ్చి తత్వాన్ని ప్రదర్శిస్తే మరణాలు సంభవించవన్నారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు వైద్య పరీక్షల కోసం ఆర్‌ ఎం పి ల వద్దకు వెళ్లకుండా తగు సూచనలు సంభందిత వైద్యాధికారులు తెలపాన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం సురక్షిత మాతృత్వం, నవజాత శిశువు సంరక్షణ మన అందరి బాధ్యత అని, ఏ స్త్రీ జన్మనిస్తూ మరణించ కూడదు, ఏ శిశువూ మరణించడాని కే జన్మించ కూడదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సుజాత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, డి పి హెచ్‌ ఎన్‌ ఒ లు ఈరమ్మ, ఇందిర, వేణు గోపాల్‌, లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img