Monday, April 22, 2024
Monday, April 22, 2024

డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం.. జగన్‌

పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ మాట్లాడుతూ..పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి చంద్రబాబు తప్పుడు పనులేనన్నారు. మీరు మనుషుల్లా కాకుండా రాక్షసుల్లా ఆలోచన చేస్తున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.6.86లక్షల పరిహారం గతంలో ఇచ్చారన్నారు.తాము అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.10లక్షలకు పెంచుతామని చెప్పామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో జారీ చేశామని సీఎం జగన్‌ అన్నారు. మొదట స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పనులు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img