Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి

ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనాను ఎదుర్కొనేందుకు తయారు చేసిన కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారుచేసే కంటిచుక్కుల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానకి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ఉన్నత న్యాయస్థారం విచారణ జరిపింది. కంటి చుక్కల మందు తయారీకి అనుమతి ఇవ్వాలని ఆనందయ్య పెట్టుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టంచేసింది. కాగా ఆనందయ్య తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో తాము దాఖలు చేసిన దరఖాస్తును, ప్రభుత్వ సమాధానాన్ని ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఆనందయ్య తయారు చేసిన కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది.. కరోనాతో ఎంతమంది మరణించారు?. ఆనందయ్య మందుతో ఎంత మంది చనిపోయారో వెల్లడిరచాలని ఆదేశించింది.. అనంతరం ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img