Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను సర్కారు బలవంతం చేయడంలేదు

మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని అన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఒక వేళ .. ప్రైవేట్‌ విద్యాసంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చని మంత్రి సురేష్‌ అన్నారు. కొన్ని చోట్ల కనీస వసతులు లేవని అన్నారు. తల్లిదండ్రులపై ఎలాంటి బలవంతపు ఒత్తిడి చేయడం లేదని అన్నారు. విద్యార్థులకు.. దగ్గరలో ఉన్న స్కూల్స్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. దీనిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని అన్నారు.తమ ప్రభుత్వం.. విద్యా రంగం అభివృద్ధికి అనేక సంస్కరణల్లో భాగంగానే చర్యలు తీసుకుంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img