Friday, April 26, 2024
Friday, April 26, 2024

చేయూత, ఆసరా పథకాలపై సీఎం జగన్‌ సమీక్ష


ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోంది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష చేపట్టారు. 2014లో చంద్రబాబు అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే అక్కడితో భారం పోయేదని, కానీ చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడిరదన్నారు. మహిళలను ఆదుకోకపోవడంతో మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమయ్యిందన్నారు. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకువచ్చాం. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవగాహన, చైతన్యం కల్పించాలన్నారు. ఇళ్ల లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ తెలిపారు. అనంతరం వైఎస్సార్‌ చేయూతపైన సమీక్షించారు. . వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. . వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కావొద్దని సీఎం స్పష్టం చేశారు. మనం ఎలాంటి ఉపాధిమార్గం చూపినా మహిళలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చేయూత, ఆసరా పథకాలపై సీఎం జగన్‌ సమీక్ష
ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోంది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష చేపట్టారు. 2014లో చంద్రబాబు అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే అక్కడితో భారం పోయేదని, కానీ చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడిరదన్నారు. మహిళలను ఆదుకోకపోవడంతో మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమయ్యిందన్నారు. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకువచ్చాం. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవగాహన, చైతన్యం కల్పించాలన్నారు. ఇళ్ల లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ తెలిపారు. అనంతరం వైఎస్సార్‌ చేయూతపైన సమీక్షించారు. . వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. . వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కావొద్దని సీఎం స్పష్టం చేశారు. మనం ఎలాంటి ఉపాధిమార్గం చూపినా మహిళలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img